కందనూలు, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు రాస్తారోకో చేపట్టారు. మంగళవారం బిజినేపల్లి లో ఓ వర్గానికి చెందిన వ్యక్తి బస్టాండ్ దగ్గర అంబేద్కర్ చౌరస్తాలో కట్టిన స్వాముల మాలాధారణ బ్యానర్లు చించి కాలు కింద వేసి తొక్కారని ఆరోపించారు. గుడిపై ఏర్పాటు చేసిన సౌండ్ బాక్స్ మైకు వైర్లను కట్ చేశారు. ఈ సంఘటనను గుర్తించిన అయ్యప్ప మాలాధారణ స్వాములు, హనుమాన్ స్వాములు, పలు పార్టీల నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించారు.
చౌరస్తాలో నలుదిక్కులా నిల్చొని బంద్ పాటించారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. బాధ్యులైన వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నినదించారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి అయ్యప్ప స్వామిని, భక్తులను అవమానించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. నిరసనలో అయ్యప్ప స్వాములు పులిందర్ రెడ్డి , శ్రీనివాస్, తిరుపతయ్య , నాగర్ కర్నూల్ స్వాములు బిజినేపల్లి స్వాములు పాల్గొన్నారు