ఖానాపూర్లో 21 నుంచి అయ్యప్ప ఆలయ వార్షికోత్సవాలు

ఖానాపూర్, వెలుగు : ఖానాపూర్ పట్టణం జేకే నగర్ కాలనీలోని శ్రీ లలితా పరమేశ్వరి అయ్యప్ప ఆలయ 9వ వార్షికోత్సవాలను ఈనెల 21 నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు అడిదెల రాజన్న ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో శ్రీ లలితా సహస్త్రనామ కుంకుమార్చన, సుదర్శన ఛండీయాగం, పూర్ణాహుతితో పాటు తదితర పూజా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వేడుకలకు హాజరయ్యే భక్తులకుమహా అన్నదానం నిర్వహించనున్నట్లు చెప్పారు.