మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన అయ్యప్పస్వాములు

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన అయ్యప్పస్వాములు

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని రాష్ట్ర అయ్యప్ప ఐక్యవేదిక ప్రతినిధులు కలిశారు. హిందూదేవుళ్లను, అయ్యప్ప స్వామిని కించపరుస్తూ... వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో హిందూ దేవతలపై ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

బైరి నరేష్పై పీడీ యాక్ట్ పెట్టాలని.. అతనితో పాటు ఆ రోజు స్టేజ్పై ఉన్న అందరినీ అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రెంజర్ల రాజేష్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్లో హిందూ దేవుళ్లను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని మంత్రికి  వినతిపత్రం అందజేశారు.