హైదరాబాద్ లో ఆజాద్ ఇంజినీరింగ్ ప్లాంటు షురూ

హైదరాబాద్ లో ఆజాద్ ఇంజినీరింగ్  ప్లాంటు షురూ

హైద‌‌‌‌రాబాద్, వెలుగు: ప్రెసిషన్ ఇంజినీరింగ్ సేవలు అందించే హైదరాబాద్​ కంపెనీ ఆజాద్ ఇంజినీరింగ్ హైదరాబాద్‌‌లోని తునికొల్లారంలో మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ (ఎంహెచ్ఐ) కోసం ప్రత్యేక లీన్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీని ప్రారంభించింది. ఈ 7,200 చదరపు మీటర్ల అత్యాధునిక కేంద్రాన్ని ఎంహెచ్ఐ ఎనర్జీ సిస్టమ్ జీటీసీసీ బిజినెస్ డివిజన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మసాహిటో కటావోకా ప్రారంభించారు.

 తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఆజాద్ ఇంజనీరింగ్ చైర్మన్, సీఈఓ రాకేష్ చోప్దార్ త‌‌‌‌దిత‌‌‌‌రులు పాల్గొన్నారు.   2024 నవంబర్ 3న ఆజాద్ ఇంజనీరింగ్​తో జపాన్‌‌‌‌లోని మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తో లాంగ్​టర్మ్​ కాంట్రాక్ట్ , ప్రైస్ అగ్రిమెంట్​పై సంతకం చేసిన త‌‌‌‌ర్వాత ఈ ప్లాంటు మొదలయింది.