ఆకాశ ఎయిర్‌‌‌‌‌‌‌‌లో అజీమ్‌‌‌‌ ప్రేమ్‌‌‌‌జీ పెట్టుబడులు

ఆకాశ ఎయిర్‌‌‌‌‌‌‌‌లో అజీమ్‌‌‌‌ ప్రేమ్‌‌‌‌జీ పెట్టుబడులు

న్యూఢిల్లీ: ప్రేమ్‌‌‌‌జీ ఇన్వెస్ట్‌‌‌‌ (అజీమ్‌‌‌‌ ప్రేమ్‌‌‌‌జీ కంపెనీ), క్లేపాండ్‌‌‌‌  క్యాపిటల్ (రంజన్‌‌‌‌ పాయ్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ఆఫీస్‌‌‌‌),  360 వన్ అసెట్‌‌‌‌ నుంచి ఫండ్స్ సేకరించేందుకు   ఆకాశ ఎయిర్‌‌‌‌‌‌‌‌ రెడీ అవుతోంది. ఫండ్స్ సేకరించాలని  చూస్తున్నామని, పెట్టుబడులు పెట్టడానికి  ప్రముఖ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారని తెలిపింది.

లేట్ బిలియనీర్​ రాకేష్ జున్‌‌‌‌జున్‌‌‌‌వాలా ఫ్యామిలీ  ఆకాశ ఎయిర్‌‌‌‌‌‌‌‌లో తన పెట్టుబడులు పెంచనుంది. అగ్రిమెంట్స్ కుదిరాయని,  రెగ్యులేటరీ నుంచి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని కంపెనీ‌‌‌‌వెల్లడించింది.