ప్రజలపై మరో భారం..900 రకాల మెడిసిన్స్​ ధరల పెంపు

ప్రజలపై మరో భారం..900 రకాల మెడిసిన్స్​ ధరల పెంపు

న్యూఢిల్లీ: అజిత్రోమైసిన్, ఇబుప్రోఫెన్ వంటి 900 రకాల డ్రగ్స్​ ధరలను పెంచామని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్​పీఏ) ప్రకటించింది. ధరల పెంపు 1.74 శాతం వరకు ఉంటుందని తెలిపింది. ఈ జాబితాలో ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, షుగర్​కు సంబంధించిన మందులు ఉన్నాయి. ఈ షెడ్యూల్డ్ మందుల సీలింగ్ ధరలను టోకు ధర ల సూచిక(డబ్ల్యూపీఐ) ఆధారంగా మార్చారు.

2024–25 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్డ్ మందుల సీలింగ్ ధరలు గత ఏప్రిల్​ 0.00551 శాతం పెంచామని కేంద్ర రసాయనాలు,  ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ లోక్‌‌సభలో రాతపూర్వక సమాధానంలో తెలిపారు.  రసాయనాలు,  ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్​పీఏ,  డబ్ల్యూపీఐ ఆధారంగా ప్రతి సంవత్సరం ముఖ్యమైన మందుల ధరలను సవరిస్తుంది. ధరల పెంపునకు కేంద్రం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదు.