సింహగర్జన సభకు బీసీలు తరలిరండి

సింహగర్జన సభకు బీసీలు తరలిరండి

హైదరాబాద్, వెలుగు: సామాజిక న్యాయం, సబ్బండ కులాలకు రాజకీయ అధికారం అజెండాతో ఆదివారం బీసీల సింహగర్జన సభ నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ గౌడ్​ చెప్పారు. సభ నిర్వహించనున్న ఎల్బీ నగర్​ సరూర్​నగర్​ స్టేడియాన్ని శనివారం ఆయన పరిశీలించారు. సింహగర్జన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. 

పార్టీలకతీతంగా నేతలు సభకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహాసభకు బీఆర్ఎస్​ ఎంపీ కె. కేశవరావు, బీజేపీ ముఖ్య నేతలు, కాంగ్రెస్​ నేతలు మధుయాష్కీ గౌడ్​, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, మంద కృష్ణ, విశారదన్​ మహరాజ్, జి. చెన్నయ్య తదితరులు హాజరవుతారని చెప్పారు.