ఆర్మూర్, వెలుగు : జూన్ 2 నుంచి12 వరకు తెలంగాణ ప్రజా ఆకాంక్షల దీక్షాదివస్ జరపాలని సీపీఐఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు వి.ప్రభాకర్, బి.దేవారాం కోరారు. మంగళవారం ఆర్మూర్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థి బలిదానాలపైన నేడు రాజకీయాలు చేస్తూ, ఇచ్చిన హామీలను పక్కనపెట్టి దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజలను, మేధావులను, విద్యార్థులను మరోసారి మోసం చేస్తోందన్నారు.
రాష్ట్రంలో కుటుంబ పరిపాలన ఏకపక్షంగా సాగుతుందని ఆరోపించారు. వీటన్నిటినీ నిరసిస్తూ దీక్ష దివాస్ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్ ప్రజాపంథా ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్, నాయకులు నజీర్, శ్రీనివాస్ బొట్ల రాజు, విజయ్ పాల్గొన్నారు.