ఏపీలో బీ ఫార్మసీ, ఫార్మ్-డీ కోర్సుల అడ్మిషన్ షెడ్యూల్ ను సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి సోమవారం ( అక్టోబర్ 30) విడుదల చేసారు. M.P.C., Bi.P.C. అభ్యర్ధులకు విడివిడిగా నిర్వహిస్తామని తెలిపారు. MPC విద్యార్ధులు నవంబరు ఒకటి నుండి ఎనిమిదో తేదీ వరకు ఆన్ లైన్ లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. సహాయ కేంద్రాల వద్ద ధువీకరణ పత్రాల వెరిఫికేషన్ కు నవంబరు 8, 9 తేదీల్లో సహాయ కేంద్రాల వద్ద సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. ఐచ్చికాల నమోదుకు నవంబరు 10, 11,12 తేదీలలో మూడు రోజులు... తరువాత 12 వ తేది మార్పునకు అవకాశం ... 14వ తేదీ సీట్ల కేటాయింపు ఉంటుంది. నవంబరు 15, 16 తేదీలలో సీట్లు పొందిన అభ్యర్ధులు ఆయా కళాశాలల్లో స్వయంగా రిపోర్డు చేయాలి.
ఇక Bi.P.C. విద్యార్ధులు కూడా నవంబరు ఒకటి నుండి ఎనిమిదో తేదీ వరకు ఆన్ లైన్ లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. సహాయ కేంద్రాల వద్ద సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు నవంబరు 9 నుండి 11 వరకు మూడు రోజులు ... నవంబరు 11 నుండి 13 వరకు ఐచ్చికాలను నమోదు... ఐచ్చికాల మార్పు నవంబరు 14వ తేదీ.. ఆ తరువాత 17వ తేదీ సీట్లను కేటాయిస్తామనిఏపీ ఈఎపి సెట్ కన్వీనర్ పేర్కొన్నారు. నవంబరు 18 నుండి 21 వరకు బైపిసి విద్యార్ధులు కళాశాలల్లో స్వయంగా రిపోర్డు చేయాలన్నారు.