కరీంనగర్ టౌన్, వెలుగు: ఎలక్షన్లు నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన టీంలు ఎన్నికల విధులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ బి. గోపి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో ఎంసీసీ, ఎఫ్ఎస్టీ, ఎస్టీటీ, సీ-విజిల్, వీడియో సర్వెలెన్స్ బృందాల విధులపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించాలని ఆదేశించారు. ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే స్పందించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లు, వాల్ రైటింగ్ లను తొలగించాలని ఆదేశించారు.
ప్రతీ టీమ్ లోని సభ్యులకు ఐడీ కార్డులతో పాటు వాహనాలను సమకూరుస్తామన్నారు. ప్రజలు రూ.50వేలకు పైబడి నగదుతో ప్రయాణం చేయొద్దని సూచించారు. నగదుతో ప్రయాణం చేసే క్రమంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా జిల్లాలో ముగ్గురు సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. పొలిటికల్ సమావేశాలను వీడియో రికార్డు చేయించాలన్నారు. అనంతరం పొలిటికల్ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ సువిధ యాప్ ద్వారా పర్మిషన్లు, నామినేషన్ల ప్రక్రియ సులభతరం అయిందన్నారు. సమావేశంలో సీపీ సుబ్బరాయుడు, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, వివిధ పార్టీల లీడర్లు చంద్రమౌళి, శ్రీనివాస్, వాసుదేవ రెడ్డి, మోహన చారి, సిరాజ్ హుస్సేన్ , అబ్బాస్ సమీ, సత్తినేని శ్రీనివాస్, ఆగయ్య పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ ఎన్నికల కోడ్‌ను పాటించాలి
పెద్దపల్లి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహిస్తామని, ఎన్నికల నియమావళిని ప్రతీ ఒక్కరూ పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలను పక్కాగా అమలుచేయాలన్నారు. మతం, కులం, ప్రాంతంపై విద్వేష వ్యాఖ్యలు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులు, తప్పుడు ప్రచారాలు చేయడం నిషేధమన్నారు.
రాజకీయ పార్టీలకు, లీడర్లకు సమావేశాలకు సింగిల్ విండో సిస్టం ద్వారా పర్మిషన్లు ఇస్తామన్నారు. ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాల్లో, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో సమావేశాలు నిర్వహించొద్దని సూచించారు. ఎన్నికల కోడ్‌ఉల్లంఘన ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లాలో 10 సర్వేలెన్స్, 10 ఫ్లైయింగ్ స్క్వాడ్, 5 వీడియో సర్వెలెన్స్ టీంలను, ఎంసీఎంసీ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో డీసీపీ వైభవ్ గైక్వాడ్, అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.