- మినిమమ్ వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్
గోదావరిఖని, వెలుగు : కోల్ ఇండియాలో మాదిరిగానే త్వరలోనే సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించేలా చూస్తామని మినిమమ్ వేజ్అడ్వైజరీ బోర్డు చైర్మన్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్ప్రసాద్తెలిపారు. బుధవారం రాత్రి గోదావరిఖని సూర్యనగర్ఆఫీస్వద్ద కాంట్రాక్టు కార్మికులతో మీటింగ్ నిర్వహించారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు సంస్థ లాభాల్లో రూ.5,000 ఇవ్వడానికి కృషి చేసిన జనక్ ప్రసాద్‌ను కాంట్రాక్ట్ కార్మికులు సన్మానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ 103 ఏండ్ల సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టు కార్మికులకు సంస్థ లాభాల్లో రూ.5000 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నదన్నారు. ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి వారం కింద కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సూక్మాండవీయను కోరగా సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో ఐఎన్టీయూసీకి అనుబంధంగా కాంట్రాక్టు కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి హక్కుల కోసం పోరాడుతామన్నారు. ఈ మీటింగ్‌లో లీడర్లు పి.ధర్మపురి, కాంపెల్లి సమ్మయ్య, జె.శంకర్రావు, శ్యామ్, లక్ష్మిపతిగౌడ్, వికాస్కుమార్, శేషరత్నం తదితరులు పాల్గొన్నారు.