90 గంటలు పని చేయాలనడం మూర్ఖత్వం : చైర్మన్ ​జనక్​ ప్రసాద్

  • మినిమం ​వేజ్​ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ​జనక్​ ప్రసాద్
  • ఎల్అండ్ టీ సంస్థ చైర్మన్ వ్యాఖ్యలపై మండిపడిన కార్మిక నేతలు​

గోదావరిఖని, వెలుగు :  ఉద్యోగులపై  ఎల్ అండ్ టీ సంస్థ చైర్మన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మినిమం వేజ్​ అడ్వైజరీ బోర్డు చైర్మన్, ఐఎన్​టీయూసీ సెక్రటరీ జనరల్​ బి.జనక్ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి మాట్లాడడం.. ఆయన మూర్ఖత్వమని మండిపడ్డారు.  సోమవారం గోదావరిఖని మెయిన్​ చౌరస్తాలో యూనియన్​ ఆధ్వర్యంలో సుబ్రమణ్యం దిష్టిబొమ్మను దహనం చేశారు.

ప్రతి ఉద్యోగి వారానికి 48 గంటలు పని చేయాలని చట్టం చెబుతుంటే.. దానికి విరుద్ధంగా 90 గంటలు పని చేయాలనడంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్పొరేట్​సంస్థలు ఉద్యోగులను  బానిసలుగా మార్చుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. యూనియన్​సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహ రెడ్డి, ధర్మపురి, జనరల్ సెక్రటరీలు వంగ లక్ష్మీపతి గౌడ్, వికాస్ కుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి దాస్,  సదానందం,  ఆరేపల్లి శ్రీనివాస్, గడ్డం కృష్ణ, కొత్త సత్యనారాయణ రెడ్డి,  విజయ్ మోహన్, నవీన్ కుమార్ పాల్గొన్నారు.