కార్మిక సమస్యల పరిష్కారానికి ఐఎన్‌‌టీయూసీ కృషి : బి.జనక్​ ప్రసాద్​

కార్మిక సమస్యల పరిష్కారానికి ఐఎన్‌‌టీయూసీ కృషి  : బి.జనక్​ ప్రసాద్​

గోదావరిఖని, వెలుగు: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ ఎల్లప్పుడూ ముందుంటుందని యూనియన్​ సెక్రటరీ జనరల్, మినిమమ్​ వేజ్​అడ్వైజరీ బోర్డ్‌‌ చైర్మన్​ బి.జనక్​ ప్రసాద్​ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక యూనియన్​ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో టీబీజీకేఎస్​ మైన్స్​ కమిటీ మాజీ మెంబర్​నాగుల శంకర్​ ఐఎన్టీయూసీలో చేరాడు. ఆయనకు కండువా కప్పి యూనియన్‌‌లోకి జనక్‌‌ప్రసాద్‌‌ ఆహ్వానించారు.

అనంతరం మాట్లాడుతూ ప్రాతినిధ్య సంఘంగా అధికారిక పత్రం ఇచ్చిన తర్వాత ఏరియాల వారీగా జీఎంలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో లీడర్లు పి.ధర్మపురి, వడ్డేపల్లి దాస్, ​కె.సదానందం, రాజేందర్​, గడ్డం కృష్ణ, ఎన్.సాగర్, ఎ.శ్రీనివాస్, రమేశ్‌‌, దశరథం గౌడ్​ పాల్గొన్నారు.