బోధన్, వెలుగు: కులవ్యవస్థను నిర్మూలించినప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా బోధన్ డివిజన్ కార్యదర్శి బి.మల్లేశ్ పేర్కొన్నారు. శుక్రవారం సాలూర మండలం ఖజాపూర్గ్రామంలో సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో కుల నిర్మూలన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లేశ్ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు సైతం కులాలు, మతాలకు అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సత్యశోధక్సమాజ్ఏర్పడి 150 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కుల నిర్మూలన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు వ్యతిరేకంగా జ్యోతిబాఫులే ఎనలేని కృషి చేశారన్నారు. సాలూర మండల కార్యదర్శి పడాల శంకర్, లీడర్లు సీహెచ్గంగయ్య, లక్ష్మీబాయి, గంగారాం, మారుతి, భీమ్రావ్, నర్సింలు, లక్ష్మీ, నర్సుబాయి, పీరాజీ పాల్గొన్నారు.