
ఉప్పునుంతల, వెలుగు : నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు ప్రాజెక్ట్ పరిధిలోని ఉప్పునుంతల గ్రామంలోని ఒకటో అంగన్వాడీ సెంటర్లో హెల్పర్ గా పనిచేస్తున్న బి.నిర్మలకు అరుదైన గౌరవం దక్కింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటలో ఉత్తమ అంగన్వాడీ హెల్పర్‌గా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సావిత్రి ఠాకూర్ నుంచి అవార్డు అందుకున్నారు.