జనవరి ఏడు నుంచి గోయల్ ​ఇన్​ఫ్రా ఐపీఓ

జనవరి ఏడు నుంచి గోయల్ ​ఇన్​ఫ్రా ఐపీఓ

న్యూఢిల్లీ: గోయల్​ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ఎస్​ఎంఈ ఐపీఓ ఈ నెల ఏడో  తేదీన మొదలై తొమ్మిదో తేదీన ముగుస్తుంది. ప్రైస్​ బ్యాండ్​ను రూ.128–138 మధ్య నిర్ణయించారు. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.85.21 కోట్లను సేకరిస్తుంది. యాంకర్​ఇన్వెస్టర్ల బిడ్డింగ్​ఈ నెల ఆరోతేదీన ఉంటుంది.

 ఇండోర్​కు చెందిన ఈ కంపెనీ షేర్లు బీఎస్​ఈ ఎస్​ఎంఈ ప్లాట్​ఫారమ్​లో లిస్ట్​ అవుతాయి. ఫ్రెష్​ఇష్యూ ద్వారా ఇది రూ.10 ముఖవిలువ కలిగిన రూ.63.12 లక్షల షేర్లను జారీ చేస్తుంది. ఐపీఓ ద్వారా వచ్చిన డబ్బుతో క్యాపెక్స్​, వర్కింగ్​ క్యాపిటల్​అవసరాలను తీర్చుతారు. కొత్త సంస్థల కొనుగోలుకు కొంత డబ్బును వాడుతారు. సాధారణ కార్పొరేట్​అవసరాలకు కొంత మొత్తాన్ని కేటాయిస్తారు.