బీటెక్ స్టూడెంట్‌ అవయవదానం

బీటెక్  స్టూడెంట్‌ అవయవదానం
  • బీటెక్  స్టూడెంట్‌ అవయవదానం
  • పెద్ద మనసు చాటుకున్న కుటుంబసభ్యులు

గోదావరిఖని, వెలుగు: యాక్సిడెంట్  లో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలను కుటుంబసభ్యులు దానం చేసి పెద్ద మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సాఫ్ట్ వేర్​ఇంజినీర్​ సిరిపురం వంశీ, హైదరాబాద్​లో బీటెక్​ చదువుతున్న సాయి నితీశ్ ఫ్రెండ్స్. వీరు గత నెల 24న బైక్ పై ఎన్టీపీసీకి వెళ్లి తిరిగి గోదావరిఖనికి పోతుండగా మాతంగి కాలనీ రోడ్డులో అదుపుతప్పి కిందపడిపోయారు.

వంశీ స్పాట్​లో మృతి చెందగా, సాయి నితిశ్ తీవ్రంగా గాయపడ్డాడు.  అప్పటి నుంచి సికింద్రాబాద్​యశోద హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​తీసుకుంటున్న సాయి నితీశ్(22) ఆదివారం రాత్రి  బ్రెయిన్​డెడ్​అయ్యాడు. దీంతో అతడి అవయవాలను జీవన్​దాన్​ట్రస్ట్​కు ఇచ్చేందుకు పేరెంట్స్ ఉమ, మల్లేశ్ అంగీకరించి డొనేట్ చేశారు. సోమవారం సాయంత్రం డెడ్ బాడీని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.