
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో బి. వైష్ణవి రెండు గోల్డ్ సహా నాలుగు మెడల్స్‌తో సత్తా చాటింది. గురువారం ముగిసిన ఈ టోర్నీలో10 మీటర్ల పిస్టల్ యూత్ విమెన్, సబ్ యూత్ విమెన్ కేటగిరీల్లో గోల్డ్ మెడల్స్ నెగ్గింది. జూనియర్, సీనియర్ విమెన్స్ విభాగాల్లో రెండు సిల్వర్ మెడల్స్ సొంతం చేసుకుంది. ధవళిక 50 మీ. రైఫిల్ ప్రోన్ విమెన్, జూనియర్ విమెన్ కేటగిరీల్లో టాప్ ప్లేస్‌తో రెండు బంగారు పతకాలు ఖాతాలో వేసుకుంది.