పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి  : బి.వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌

ముస్తాబాద్, వెలుగు: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్‌‌‌‌ ఎంపీ అభ్యర్థి బి.వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌‌‌‌ మండలంలో ఆయన పర్యటించారు. రెండు రోజుల కింద కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్తాబాద్​ మండలంలో రెండు రోజుల కింద కురిసిన వానకు 1400 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఎకరాకు రూ.25వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్​చేశారు. లీడర్లు జనగామ శరత్ రావు, గోపాలరావు,  అంజిరెడ్డి, అక్కరాజు, శ్రీనివాస్,  సర్వర్ పాషా పాల్గొన్నారు.