గన్నేరువరం, వెలుగు: తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ప్లానింగ్కమిషన్ వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధీమా వ్యక్తం చేశారు. గన్నేరువరం మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని, ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు సాధ్యం కాదన్నారు.
తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి గ్యారంటీలు పేరిట కాంగ్రెస్ డ్రామా ఆడుతోందన్నారు. ఎంపీపీ మల్లారెడ్డి, జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మి, మాజీ జడ్పీటీసీ మన్మోహన్ రావు, ఉప సర్పంచ్ వెంకటేశ్ పాల్గొన్నారు.