- ప్లానింగ్ కమిషన్ వైస్చైర్మన్వినోద్కుమార్
వేములవాడరూరల్, బోయినిపల్లి, వెలుగు : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 3 గంటల కరెంటే ఇస్తారని ప్లానింగ్‌కమిషన్ వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, బోయినిపల్లి మండలాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం చందుర్తి, బోయినిపల్లి మండలకేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయక ప్రజలపై అక్రమంగా కేసులు పెట్టే నాయకుడు కావాలో.. మీ కష్టాల్లో పాలుపంచుకునే తనలాంటి లీడర్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు.
సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలుచేస్తామన్నారు. బోయినిపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్అభ్యర్థి సుంకె రవిశంకర్‌ను గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ-, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సీనియర్ నాయకుడు మనోహర్ రెడ్డి, ఎంపీపీ లావణ్య, లీడర్లు ఎల్లయ్య, అబ్రహం, శ్రీనివాసరావు, గోవిందరావు, కిషన్ రావు, శ్రీనివాస్, నర్సయ్య యాదవ్ పాల్గొన్నారు.