రాష్ట్రంలో మైక్రో ప్లానింగ్ పథకం: బి.వినోద్ కుమార్

కొడిమ్యాల, వెలుగు:  రానున్న రోజుల్లో రాష్ట్రంలో మైక్రో ప్లానింగ్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్లానింగ్​ బోర్డ్​ వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ తెలిపారు. బుధవారం కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ మైక్రో ప్లానింగ్​పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి అవసరాలను గుర్తించి, దానికి అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్లాన్​చేయనున్నట్లు చెప్పారు. 

కాగా ప్రచారంలో మెదటి రోజు ప్రజల నుంచి గృహలక్ష్మి, పింఛన్లు ఇవ్వాలని పలువురు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీ ప్రశాంతి, సర్పంచులు మల్లేశం, మమత, లీడర్లు కృష్ణారావు, రాజనర్సింగ రావు పాల్గొన్నారు.