బోయినిపల్లి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరుగా ఆగమవుతుందని ప్లానింగ్‌కమిషన్ వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం బోయినిపల్లి మండలంలో చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్‌కు ఓటేసి రవిశంకర్ ను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చెన్నాడి అమిత్ రావు ఆధ్వర్యంలో కోరేం నుంచి నర్సింగాపూర్ దాక భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు