చొప్పదండి, వెలుగు : బీఆర్ఎస్ ప్రత్యేక రాష్ట్రం తెస్తామని చెప్పి, తెలంగాణ సాధించామని, అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ అమలుచేశామని రాష్ట్ర ప్లానింగ్బోర్డ్వైస్చైర్మన్ బి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. చొప్పదండి అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చొప్పదండిలో తెలంగాణ చౌరస్తా వద్ద భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటిదాకా చెప్పినవన్నీ చేశామని, మరోసారి బీఆర్ఎస్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు కరెంట్3 గంటలే ఇస్తారని ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఓటేయాలన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సుంకె రవిశంకర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో లీడర్లు వెంకటేశ్వరరావు, రవీందర్ రెడ్డి, గుర్రం నీరజ, విజయలక్ష్మి, రవీందర్, సౌజన్య, మల్లారెడ్డి, తిరుపతిరావు, చుక్కారెడ్డి, రాజశేఖర్, శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, లీడర్లు పాల్గొన్నారు.