మానకొండూర్, వెలుగు: మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో టెక్నికల్‌గా కొన్ని ఇబ్బందులు జరిగాయని, వాటిని సరిదిద్దుకోవాలి తప్ప ప్రాజెక్టే తప్పనడం సరికాదని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ అన్నారు. నిర్మాణ రంగంలో అప్పుడప్పుడు ఇలాంటి తప్పిదాలు జరుగుతాయన్నారు.
మానకొండూరు మండల కేంద్రంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో కాకతీయ కాలువ ద్వారా ఒక డ్రై క్రాప్ కు మాత్రమే సాగునీరు వచ్చేదని, ఇప్పుడు ఏటా చెరువులు, కుంటలు నింపుతున్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌వస్తే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్నారు.