విదేశాల్లో వ్యాపార అవకాశాలపై బీ2బీ సమావేశం

విదేశాల్లో వ్యాపార అవకాశాలపై బీ2బీ సమావేశం

హైదరాబాద్, వెలుగు: అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), యూఏఈ ప్రభుత్వం, తెలంగాణ చాంబర్​ ఆఫ్ కామర్స్ అండ్​ ఇండస్ట్రీ సహకారంతో, బిజినెస్​ టూ బిజినెస్​(బీ2బీ) సమావేశాలను నిర్వహిస్తామని ప్రకటించింది. 

‘‘యూఏఈ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీ వ్యాపారాన్ని విస్తరించడం” అనే అంశంపై ఈ నెల 22,  23 తేదీలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్​లోని ఐటీసీ కాకతీయ హోటల్​లో సమావేశాలు జరుగుతాయి. 

వ్యాపార ప్రోత్సాహకాలు, సున్నా పన్నులు,  కంపెనీ రిజిస్ట్రేషన్, మిడిల్​ ఈస్ట్​, ఆఫ్రికా, రష్యా,  ఐరోపాలో వ్యూహాత్మక మార్కెట్లను చేరుకోవడంతోపాటు యూఏఈలో వ్యాపార అవకాశాలు,  ప్రయోజనాల గురించి వివరిస్తారు. భారతీయ కంపెనీలు తమ కార్యకలాపాలను విదేశీ మార్కెట్లలోకి ఎలా విస్తరించుకోవచ్చో తెలియజేస్తారు. దీనికి హాజరు కావడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

మరిన్ని వార్తలు