బాహుబలి బచ్చా.. వయసు ఏడాదిన్నర.. బరువు 14కిలోలు

పిల్లలు పుట్టినపుడు వారి ఆరోగ్యంతో పాటు, ఎంత బరువుతో పుట్టారన్నది కూడా ముఖ్యమే. ఎందుకంటే వయసుకు తగ్గ బరువు ఉంటేనే ఎవరైనా ఆరోగ్యంగా ఉంటారు. అత్యధిక బరువు అనారోగ్యానికి దారి తీస్తుంది. బొద్దుగా ఉండే పిల్లలంటే అందరికీ చూడముచ్చటగానే ఉంటుంది. కానీ వయసు తక్కువ, బరువు ఎక్కువ ఉంటే.. దాని వల్ల వచ్చే నష్టాలు, అనారోగ్యాలు కూడా ఎక్కువే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం కూడా దాని గురించే. ఓ పిల్లాడికి ఏడాదిన్నర వయసే. కానీ చూస్తే మాత్రం 4ఏళ్ల బాలుడిగా కనిపిస్తున్నాడు.

జలెన్ అనే చిన్నారి గత కొన్నిరోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్నాడు. కారణం రోజురోజుకూ పెరుగుతున్న అతని బరువే. జలెన్ పుట్టినపుడు అందరి పిల్లలాగానే సాధారణ బరువుతోనే పుట్టాడు. కానీ అతను పెరిగే కొద్దీ.. అతని బరువు కూడా పెరుగుతూ వస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అతని వయసు పిల్లల బట్టలు అతనికి సరిపోవడం లేదు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు, చుట్టపక్కల వారు చూసి చలించిపోయారు.

అమెరికాలోని టెక్సాస్ లో నివసిస్తోన్న సాలిట్జాకు పుట్టిన జలెన్ ప్రస్తుత వయసు ఏడాదిన్నర. కానీ చూడడానికి మాత్రం ఇతను 4ఏళ్ల వయసున్న పిల్లాడిలా కనిపిస్తున్నాడు. అతని బరువు సాధారణ పిల్లల కన్నా భిన్నంగా ఉంది. 12, 18నెలల వయసులో వేసుకోవాల్సిన బట్టలు కాకుండా తన కంటే పెద్ద వయసున్న పిల్లల బట్టలు అతనికి సరిపోతున్నాయి. అంతేకాదు డాక్టర్ వద్దకెళ్లిన ప్రతీసారి ఆ చిన్నారి వయసు తప్పుగానే భావిస్తారట. సాలిట్జా పెద్ద కుమారుడు వయసు 4ఏళ్లు. అతని బట్టలు చిన్న కొడుకు జలెన్ కు వస్తున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఎంత భిన్నంగా ఉందో.

డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

మెట్రో రిపోర్ట్ ప్రకారం.. బరువు పెరగడం వల్ల పిల్లాడి ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి సమస్యా లేదని చెప్పారు. పిల్లాడి అన్న వయసు రెండున్నరేళ్లు ఎక్కువ. కానీ వారిద్దరి బరువు దాదాపు ఒకేలా ఉంటుంది. జలెన్ ప్రస్తుత బరువు 14కిలోలు కాగా.. అతని సోదరుని బరువు 14.5కిలోలు. అధిక బరువు కారణంగానే ఆ పిల్లాడికి నడక కూడా లేటుగా వచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు.

https://www.instagram.com/p/CbH-o1MrDQW/?img_index=2