బాహుబలి నిర్మాత షాకింగ్ ట్వీట్.. అంత యాటిట్యూడ్ ఎందుకు?

బాహుబలి నిర్మాత షాకింగ్ ట్వీట్.. అంత యాటిట్యూడ్ ఎందుకు?

బాహుబలి(Bahubali) నిర్మాత శోభు యార్లగడ్డ(Shobu Yarlagadda) చేసిన ట్వీట్ టాలీవుడ్ లో దుమారం రేపుతోంది. తాజాగా ఆయన ఒక యంగ్ హీరోను ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్ చేశారు. ఓ యంగ్‌ హీరో ఆటిట్యూడ్‌ వల్ల ఒక మంచి సినిమాను వదులుకున్నాడని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు శోభు. తరువాత కాసేపటికి దానిని తొలగించారు. దీంతో నిర్మాత శోబు ప్రస్తావించిన ఆ యంగ్‌ హీరో ఎవరు..?  ఆ హీరో వదులుకున్న సినిమా ఏమిటని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

అసలు విషయం ఏంటంటే.. శోభు యార్లగడ్డ తన ట్వీట్‌లో..  "ఇటీవల సూపర్ సక్సెస్‌లో ఉన్న ఓ యంగ్‌ హీరో ఆటిట్యూడ్‌ వల్ల ఒక మంచి సినిమాను వదిలేసుకున్నాడు. మనం సక్సెస్ లో ఉన్నప్పుడు ఆ సక్సెస్ ను చాలా జాగ్రత్తగా హ్యాండిల్‌ చేయాలి. ఒక డెబ్యూ డైరెక్టర్ కథ చెప్పడానికి కనీస గౌరవం చూపలేదు ఆ హీరో. అలాంటి యాటిట్యూడ్ ఆ హీరో కెరీర్‌కు ఏమాత్రం మంచిది కాదు. త్వరలోనే ఈ విషయంపై రిలైజ్‌ అవుతాడని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

అయితే ఆ హీరో ఎవరు అనేది మాత్రం ఆ ట్వీట్ లో మెన్షన్ చేయలేదు శోబు. అయితే ఈ ట్వీట్ చూసిన చాలా మంది విశ్వక్ సేన్(Vishwak sen) గురించే చేశారని కామెంట్స్ చేస్తన్నారు. ఆ దర్శకుడు కూడా మరెవరో కాదు బేబీ(Baby) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సాయి రాజేష్(Sai Rajesh) అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి దీనిపై విశ్వక్ సేన్ ఎలా స్పందిస్తారో చూడాలి.