బాల్యవివాహాలు సామాజిక దురాచారం : తహసీల్దారు మాలతి

బాల్యవివాహాలు సామాజిక దురాచారం : తహసీల్దారు మాలతి

ధర్పల్లి, వెలుగు:  బాల్యవివాహాలు సామాజిక దురాచారమని, వీటి వల్ల బాలల విద్య, రక్షణ, ఆరోగ్యం, అభివృద్ధి, భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని తహసీల్దారు మాలతి అన్నారు. ధర్పల్లి కస్తూర్బాగాంధీ స్కూల్​లో బుధవారం ''బాల్ వివాహ్​ ముక్త్ భారత్'' కార్యక్రమాన్ని  వివిధ శాఖల సమన్వయంతో ఐసీడీఎస్​ ఆధ్వర్యంలో ​నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాలను అడ్డుకోవాలన్నారు.

బాలలకు చట్టంలో సమానత్వం ఉందని గుర్తుంచుకోవాలని అన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా  చైతన్యం రావాలని, మహిళలు తమని తాము తక్కువగా అంచనా వేసుకోవద్దని సూచించారు.   కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ, ఎస్​ఐ రామకృష్ణ, మెడికల్​ ఆఫీసర్​ డాక్టర్​ మౌనిక, ప్రిన్సిపాల్​ సుమలత పాల్గొన్నారు.   

బోధన్, వెలుగు: బాల్య వివాహాలు చేస్తే పిల్లలు అనారోగ్యానికి గురవుతారని జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయ కర్త పి.స్వప్న అన్నారు. బుధవారం బోధన్ లోని రాకాసిపేట్​ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆడపిల్లలు చిన్న వయస్సులో గర్భవతులు కావడంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతారన్నారు.  

ఎవరైనా బాల్యవివాహాలు జరిపితే  సమాచారం అందించాలన్నారు.  అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి, స్కూల్ ఆవరణలో మానవహారం నిర్మించారు.  కార్యక్రమంలో ఐసీడీఎస్​ సూపర్​వైజర్లు గోపిలక్ష్మి, ఆసియా బేగం, హెడ్మాస్టర్ బాలచందర్, అంగన్​వాడీ టీచర్లు పాల్గొన్నారు. 

ఎడపల్లి , వెలుగు: బోధన్​ ఐసీడీఎస్​ ఆధ్వర్యంలో ఎడపల్లి  బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం బాల్యవివాహాలు, సైబర్​ నేరాలు, పోక్సోచట్టాలు, సెల్​ఫోన్లు దుర్వినియోగంపై  అవగాహన కార్యక్రమం  నిర్వహించారు.  ఈ సందర్భంగా తహసీల్దార్​ దన్వాల్​ మాట్లాడుతూ..  చట్ట ప్రకారం బాల్య వివాహాలు చేయడం నేరమన్నారు.   బాల్య వివాహం చేస్తే రెండేళ్ల జైలుశిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తారన్నారు.

అనంతరం   బాల్య వివాహాలకు వ్యతిరేకంగా విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు.  అనంతరం  ''బాల్ వివాహ్​ ముక్త్ భారత్'' ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో ఎస్ఐ వంశీకృష్ణా రెడ్డి, ఐసీడీఎస్ సూపర్​వైజర్ విజయరాణి, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్​ వైజర్ సాయి కిరణ్, ప్రన్సిపాల్​గంగా శంకర్, అంగన్​ వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.