న్యూఢిల్లీ: వాల్యూ ఫ్యాషన్ రిటైలర్ బజార్ స్టైల్ రిటైల్ లిమిటెడ్ ఈ నెల 30న ఐపీఓను ప్రారంభించనుంది. ప్రైస్‌బ్యాండ్‌ను రూ. 370–-389 మధ్య నిర్ణయించింది. ఇష్యూ ద్వారా రూ. 835-కోట్లు సేకరించనుంది. సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 3న ముగుస్తుందని కంపెనీ ప్రకటించింది. ఐపీఓలో రూ. 148 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూతోపాటు ప్రమోటర్ గ్రూప్ సంస్థలు రూ. 687 కోట్ల విలువైన 1.76 కోట్ల షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా అమ్ముతాయి.
ఓఎఫ్ఎస్ కింద, రేఖా జున్‌జున్‌వాలా, ఇంటెన్సివ్ సాఫ్ట్‌షేర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటెన్సివ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లు తమ వాటాలను ఉపసంహరించుకుంటాయి. తాజా ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయంలో రూ.146 కోట్లను అప్పుల చెల్లింపులకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు. కోల్‌కతాకు చెందిన ఈ కంపెనీ ఇటీవల ప్రీ-ఐపిఓ ప్లేస్‌మెంట్ రౌండ్‌లో వోల్రాడో వెంచర్స్ పార్ట్‌నర్స్ ఫండ్ 2 నుంచి రూ. 37 కోట్లను సేకరించింది.