మేకలమ్మితే రూ. 1.32 కోట్లు

హిమాచల్ ప్రదేశ్​ ఆలయ ఆదాయమిది

వేములవాడ రాజన్నకు భక్తులు కోడె మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే హిమాచల్​ ప్రదేశ్​లోని ఓ గుడికీ భక్తులు మేకపోతులను మొక్కుగా చెల్లిస్తారు.  అలా మొక్కు చెల్లించిన మేకపోతులను గుడి అధికారులు వేలం వేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో. హమీర్ పూర్ జిల్లా డియోసిధ్ లోని బాబా బాలక్ నాథ్ ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కడ మేకలను కట్టేస్తుంటారు. ఇలా భక్తులు అందజేసే మేకలను టెంపుల్ ట్రస్ట్ ప్రతివారం వేలంలో విక్రయిస్తుంది. అదిగో అలా 2019 సంవత్సరానికి గాను ఆలయానికి ఏకంగా రూ.1.32 కోట్ల ఆదాయం వచ్చింది. ‘‘మొత్తం 6,371 మేకలను వేలంలో అమ్మినం. వీటి ద్వారా రూ.1,32,15,400 ఆదాయం వచ్చింది. ఇది పోయినేడాదితో పోలిస్తే అధికం. 2018లో 5,825 మేకలను అమ్మగా… రూ.1,19,52,700 ఇన్ కమ్ వచ్చింది” అని టెంపుల్ ఆఫీసర్ లఖన్ పాల్ తెలిపారు. అయితే ఇక్కడ జంతువులను బలి ఇవ్వాలనే సంప్రదాయమేం లేదని, ఇలా మేకలతో మొక్కు తీర్చుకుంటే కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం అని ఆయన పేర్కొన్నారు.

For More News..

కొన్నది 25 వేలకి.. అమ్మితే వచ్చేది 5 కోట్లు

ఇప్పుడు కండక్టర్‌.. రేపు కలెక్టర్‌..

ప్రపంచంలోనే అతిపెద్ద విమానం