ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్య

ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్య

ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ పై  శనివారం ( అక్టోబర్ 12, 2024 ) రాత్రి దుండగులు జరిపిన కాల్పులు కలకలం రేపాయి.దుండగులు సిద్దిఖీ ఉదరభాగంలో మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. వెంటనే ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ కన్నుమూశారు బాబా సిద్దిఖీ. ముగ్గురు దుండగులు కాల్పులు జరిపినట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

బాబా సిద్దిఖీ 50ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.. ఆ తర్వాత కొన్ని నెలల కిందట ఎన్సీపీలో చేరారు.కాగా... లీలావతి హాస్పిటల్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో బాబా సిద్దిఖీ మృతి చెందినట్లు ధృవీకరించింది. మహారాష్ట్రలో కలకలం రేపిన ఈ ఘటన ముంబై రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

సిద్దిఖీ పై దాడితో ముంబైలోని రాజకీయ ప్రముఖులలో భద్రతపై ఆందోళన కలిగించింది. రాజకీయ హింస, సమాజంపై దాని ప్రభావంపై చర్చలకు దారితీసింది ఈ కాల్పుల ఘటన .త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది.