నా తండ్రి మరణం వృధా కాదు: బాబా సిద్ధిక్ మర్డర్‎పై MLA జీషన్ ఎమోషనల్

నా తండ్రి మరణం వృధా కాదు: బాబా సిద్ధిక్ మర్డర్‎పై MLA జీషన్ ఎమోషనల్

ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, సీనియర్ పొలిటిషియన్ బాబా సిద్ధిక్ ఈ నెల (అక్టోబర్) 13న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు బాబా సిద్ధిక్‎ను కాల్చి చంపారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‎కు అత్యంత దగ్గర వ్యక్తి అయిన బాబా సిద్ధిక్ మర్డర్ మహారాష్ట్రతో పాటు బీ టౌన్‎ను షేక్ చేసింది. ఈ క్రమంలో బాబా సిద్ధిక్ మరణంపై ఆయన కొడుకు, బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిక్ తొలిసారి స్పందించాడు. గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయిన జీషన్..  తన తండ్రి మరణాన్ని రాజకీయం చేయకూడదని విజ్ఞప్తి చేశారు. మా నాన్న ఎందరో పేద అమాయక ప్రజల జీవితాలను, ఇళ్లను రక్షించే క్రమంలో తన ప్రాణాలను కోల్పోయారని అన్నారు. 

ALSO READ | వారణాసి.. నా మనసును తాకింది: ఎరిక్‌‌ గార్సెట్టి

తండ్రి మరణంతో మా కుటుంబం విచ్ఛిన్నమైందని ఎమోషనల్ అయిన జీషన్.. నా తండ్రి మరణం వ్యర్థం కాదని అన్నారు. నా కుటుంబానికి న్యాయం కావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాగా, మహారాష్ట్రంలో  సంచలనం సృష్టించిన బాబా సిద్ధిక్ మర్డర్ కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. హీరో సల్మాన్ ఖాన్ కు మిత్రుడు కావడం వల్లే బాబా సిద్ధిక్ ను చంపినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించిన విషయం తెలిసిందే.