వరల్డ్ కప్ లో పాకిస్థాన్- ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అనగానే అందరూ ఆఫ్ఘన్ వైపే మొగ్గు చూపారు. చెన్నైలో పిచ్ స్పిన్ కి అనుకూలించడంతో ఈ మ్యాచ్ పాక్ తక్కువ స్కోర్ కే పరిమితమవుతుందని భావించారు. అయితే అందరి అంచనాలను తల్లక్రిందుకు చేస్తూ పాక్ బ్యాటింగ్ లో బాగా రాణించి ఆఫ్ఘనిస్తాన్ ముందు 283 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాకిస్థాన్ కు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, ఇమాముల్ హక్ తొలి వికెట్ కు 56 పరుగులు జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. ఇమాముల్ 17 పరుగులు చేసి అవుట్ కాగా.. షఫీక్, బాబర్ అజాం పాక్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపారు. షఫీక్ 58 పరుగులు చేయగా.. బాబర్ 74 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక చివర్లో షాదాబ్ ఖాన్(40) ఇఫ్తికార్(40) మెరుపులు మెరిపించడంతో పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.
ALSO READ : తిరుమల బ్రహ్మోత్సవాల్లో కాంతారా నృత్యాలు
ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ కు 3 వికెట్లు తీసుకోగా.. నబీ, ఓమర్జాయ్, నవీన్ కు తలో వికెట్ దక్కింది. కాగా.. ఈ మ్యాచులో ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ తిరిగి జట్టులోకి చేరగా.. ఆఫ్గన్ అదనపు స్పిన్నర్ నూర్ అహ్మద్ ను తుది జట్టులోకి తీసుకొని వచ్చింది.
Such a good finish at the end by Iftikhar & Shadab.
— Nawaz ?? (@Rnawaz31888) October 23, 2023
Now we have a total that we can defend. #PAKvsAFG #WorldCup2023 pic.twitter.com/61Zcra105c