ఫార్మాట్ ఏదైనా నిలకడగా రాణించే ఆటగాళ్లలో పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ ఒకడు. ముఖ్యంగా టీ20ల్లో ఈ పాక్ బ్యాటర్ నిలకడ అసాధారణంగా ఉంటుంది. బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించకపోయినా..విధ్వంసక ఇన్నింగ్స్ లు లేకపోయినా పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతూ తనదైన శైలిలో రెచ్చిపోతాడు. టీ20 క్రికెట్ లో తన పేరు మీద ఎన్నో రికార్డులు నెలకొల్పిన బాబర్.. తాజాగా ఒక ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేశాడు. టీ20 ల్లో వేగంగా 10000 పరుగులు చేసిన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు.
271 ఇన్నింగ్స్ ల్లో బాబర్ 10 వేల పరుగుల మార్క్ చేరుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ వెస్టిండీస్ వీరుడు గేల్ పేరిట ఉంది. గేల్ 285 ఇన్నింగ్స్‌ల్లో 2017 లో ఈ మైలురాయిని అందుకున్నాడు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ 299 ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. డేవిడ్ వార్నర్(303), ఆరోన్ ఫించ్(327), జోస్ బట్లర్(350) వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. బాబర్ అంతర్జాతీయ టీ20 క్రికెట్ విషయానికి వస్తే 109 మ్యాచ్ ల్లో 3698 పరుగులు చేశాడు. వీటిలో 3 సెంచరీలతో పాటు 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ప్రస్తుతం బాబర్ అజామ్ పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడుతున్నాడు. ఈ మెగా లీగ్ లో పెషావర్ జల్మీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్ లో కరాచీ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల వద్ద 10000 పరుగుల మార్క్ ను చేరుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో 10 వేల పరుగులు చేసిన 13 వ బ్యాటర్ గా నిలిచాడు.
Babar Azam holds the record for the fewest innings to reach 10,000 T20 runs, making him the fastest to achieve this milestone.
— CricTracker (@Cricketracker) February 21, 2024
📸: Fan Code pic.twitter.com/PCFgCc3pLc