చరిత్ర సృష్టించిన బాబర్ అజామ్.. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డు

చరిత్ర సృష్టించిన బాబర్ అజామ్.. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డు

డబ్లిన్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. లోర్కన్ టెక్టర్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీ చేయగా.. గరెత్ డెలనీ(28 నాటౌట్; 10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. అనంతరం 194 పరుగుల లక్ష్యాన్ని పాక్.. 16.5 ఓవర్లలోనే ఛేదించింది. మహమ్మద్ రిజ్వాన్(75 నాటౌట్; 46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫకర్ జమాన్(78; 40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను పాక్.. 1-1తో సమం చేసింది.  

ఈ విజయంతో బాబర్ అజామ్ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రెకార్డుల్లోకెక్కాడు. అంతర్జాతీయ టీ20లలో కెప్టెన్‌గా బాబర్‌కి 45వ విజయం. ఈ ఫార్మాట్‌లో ఏ కెప్టెన్‌కైనా ఇదే అత్యధికం. ఇంగ్లాండ్‌ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్, ఉగాండా మాజీ కెప్టెన్ బ్రియాన్ మసాబాలను అధిగమించి బాబర్ ఈ రికార్డు సాధించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ ఐదో స్థానంలో ఉండగా.. ఎంఎస్ ధోని ఆరో స్థానంలో ఉన్నారు. 

టీ20ల్లో కెప్టెన్‌గా అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్లు

  • 78 మ్యాచ్‌ల్లో 45 విజయాలు: బాబర్ ఆజం (పాకిస్థాన్)
  • 56 మ్యాచ్‌ల్లో 44 విజయాలు: బ్రియాన్ మసాబా (ఉగాండా)
  • 71 మ్యాచ్‌ల్లో 44 విజయాలు: ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్)
  • 52 మ్యాచ్‌ల్లో 42 విజయాలు: అస్గర్ ఆఫ్ఘన్ (ఆఫ్ఘనిస్థాన్)
  • 54 మ్యాచ్‌ల్లో 42 విజయాలు: రోహిత్ శర్మ (భారత్)
  • 722 మ్యాచ్‌ల్లో విజయాలు: ఎంఎస్ ధోని (భారత్)