టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో దాదాపు సగం బ్యాటింగ్ రికార్డులు విరాట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ రికార్డ్స్ ఒకొక్కటిగా బ్రేక్ చేస్తూ ఆల్ టైం బెస్ట్ బ్యాటర్ గా ముందకెళ్తున్నాడు. అయితే సమీప భవిష్యత్తులో కోహ్లీ రికార్డ్స్ బ్రేక్ చేయడం బాబర్ అజామ్ కే సాధ్యమని ఇప్పటికీ చాలామంది క్రికెట్ ఫ్యాన్స్, ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా కోహ్లీ నెలకొల్పిన ఒక ఆల్ టైం రికార్డ్ ను బ్రేక్ చేసేందుకు బాబర్ సిద్ధమయ్యాడు.
ప్రస్తుతం టీ20ల్లో 4037 పరుగులతో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 3974 పరుగులతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉండగా.. 3955 పరుగులతో బాబర్ అజామ్ మూడో స్థానంలో నిలిచాడు. టీ20ల్లో కోహ్లీ, బాబర్ అజామ్ మధ్య కేవలం 82 పరుగుల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఈ రికార్డ్ ను అధిగమించడానికి బాబర్ అజామ్ కు గోల్డెన్ ఛాన్స్ లభించింది. టీ20 వరల్డ్ కప్ కు ముందు ఇంగ్లాండ్ తో నాలుగు టీ20 మ్యాచ్ లు ఆడనుంది.
లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య బుధవారం (మే 22) తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ నాలుగు టీ20 ల్లో బాబర్ 83 పరుగులు చేస్తే టీ20 క్రికెట్ లో కోహ్లీని అధిగమించి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. మరో 19 పరుగులు చేస్తే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధిక పరుగుల రికార్డ్ ను బ్రేక్ చేస్తాడు. వరల్డ్ కప్ కు ముందు బాబర్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.
Babar Azam Needs Only 83 Runs to Break Kohli Record of Most Runs in T201.#AAPakistan #Pakistan #ICC #BabarAzam #ViratKohli #India #Cricket pic.twitter.com/uwy1BY4Wk3
— All About Pakistan (@Aboutpakistan90) May 20, 2024