Babar Azam: కింగ్ అని పిలవడం మానేయండి.. ఫ్యాన్స్‌కు బాబర్ అజామ్ రిక్వెస్ట్

Babar Azam: కింగ్ అని పిలవడం మానేయండి.. ఫ్యాన్స్‌కు బాబర్ అజామ్ రిక్వెస్ట్

టీమిండియాలో విరాట్ కోహ్లీకి ఎంత ఫాలోయింగ్ ఉందో పాకిస్థాన్ లో బాబర్ కు అంతే పాపులారిటీ ఉంది. ఇక్కడ మనం కింగ్ కోహ్లీ అని పిలుచుకుంటే పాక్ దేశంలో బాబర్ ను తమ క్రికెట్ కింగ్ అని భావిస్తారు. ఫార్మాట్ ఏదైనా బాబర్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. మూడు ఫార్మాట్ లో 40 కి పైగా యావరేజ్ ఉన్న అతికొద్ది మంది ప్లేయర్లలో బాబర్ అజామ్ ఒకడు. అయితే బాబర్ అజామ్ మాత్రం తనను కింగ్ అని పిలవొద్దని ఫ్యాన్స్ కు సూచించాడు.  

బాబర్ మాట్లాడుతూ.." ముందుగా నన్ను కింగ్ అని పిలవడం మానేయండి. నేను ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు.  నేను క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ప్రజలు నన్ను ఏమని పిలుస్తారో అప్పుడు చూద్దాం. కఠినమైన దశల నుండి ముందుకు సాగడానికి ప్రయత్నిస్తాను. గతంలో నేను ఎంత బాగా రాణించినా.. రాబోయే ప్రతి మ్యాచ్ నాకు కొత్త సవాలు. నేను గతాన్ని మరచిపోయి వర్తమానంపై దృష్టి పెట్టాలి. ఒత్తిడిలో సల్మాన్, రిజ్వాన్ అద్భుతంగా ఆడారు. 250 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ గెలిపించారు". అని బాబర్ సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ అనంతరం ప్రెస్ టాక్ తో చెప్పాడు.   

ALSO READ : Ranji Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసి తప్పించారు: రంజీ ట్రోఫీలో టీమిండియా ఓపెనర్

ఫార్మాట్ ఏదైనా గత కొంతకాలంగా బాబర్ అజామ్ ఘోరంగా విఫలమవుతున్నాడు. జట్టును ఆదుకోవాల్సిన బాబర్ భారంగా మారుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ట్రై సిరీస్ రెండు మ్యాచ్ ల్లోనూ విఫలమయ్యాడు. శుక్రవారం (ఫిబ్రవరి 14) ఫైనల్ కు ముందు బాబర్ ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బాబర్ ఫామ్ లోకి రావడం పాకిస్థాన్ జట్టుకు చాలా కీలకం. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో పాకిస్థాన్ తలబడుతుంది.