Babar Azam: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్‌కు బాబర్ అజామ్ జెర్సీ.. పాక్ క్రికెటర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ తన గొప్ప మనసు చాటుకున్నాడు. అతను బుధవారం (నవంబర్ 13) గబ్బాలోని ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు తన టెస్ట్ జెర్సీని విరాళంగా అందించాడు. బాబర్ ఇచ్చిన ఈ జెర్సీ ఉస్మాన్ ఖవాజా ఫౌండేషన్‌కు వెళ్తుంది. దీని ప్రకారం అక్కడ బాబర్ జెర్సీకి వేలం వేస్తే అక్కడ అతని జెర్సీ విక్రయించబడుతుంది. ఖవాజా ఛారిటీకి విరాళంగా ఇవ్వడంతో ఆస్ట్రేలియన్ ఓపెనర్ సంతోషం వ్యక్తం చేశాడు. బాబర్ సద్భావనకు కృతజ్ఞతలు తెలిపాడు. 

"బాబర్ చాలా గొప్పవాడు. మేము క్రికెట్ ఆస్ట్రేలియాతో కలిసి ఉన్నప్పుడు.. అతను నాకు మెసేజ్ చేశాడు. 'ఉస్మాన్ నేను ఏదైనా సహాయం చేయగలనా? నేను నా జెర్సీలో ఒకదాన్ని విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను?' అని బాబర్ నాకు మెసేజ్ చేశాడు. ఖచ్చితంగా మీ మద్దతుకు మీ సహాయాన్ని నేను అభినందిస్తున్నాను". అని ఖవాజా రిప్లై ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు. ఖవాజా పాకిస్థాన్ కు చెందినవాడు కావడం విశేషం. 

ALSO READ | Jharkhand Election 2024: జార్ఖండ్ ఎలక్షన్స్.. ఓటు హక్కు వినియోగించుకున్న ధోనీ

ఇటీవలే ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలుచుకుంది. 22 ఏళ్ళ తర్వాత ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడం విశేషం. బాబర్ అజామ్ ప్రస్తుతం వన్డేల్లో నెంబర్ వన్ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. మరోవైపు ఖవాజా భారత్ తో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. ఈ నెల 22 నుంచి జరగనున్న పెర్త్ టెస్టులో ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు.