క్రికెట్ లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. టీ20, వన్డేల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఈ పాక్ బ్యాటర్.. టెస్టుల్లో దారుణమైన బ్యాటింగ్ తో జట్టుకు భారంగా మారుతున్నాడు. సొంతగడ్డపై ఫామ్ లో వస్తాడనుకుంటే పసికూన బంగ్లాదేశ్ పై ఆడలేక చతికిల పడుతున్నాడు. తాజాగా బంగ్లాదేశ్ పై టెస్ట్ సిరీస్ లోనూ బాబర్ తక్కువ స్కోర్ కే వెనుదిరిగాడు.
రావల్పిండి వేదికగా ప్రస్తుతం బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. నాలుగో రోజు ఆటలో భాగంగా పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ ఆడుతుంది. కీలకమైన ఈ ఇన్నింగ్స్ లో బాబర్ అజామ్ 11 పరుగులకే ఔటయ్యాడు. బంగ్లా పేసర్ రానా బౌలింగ్ లో షాదం ఇస్లాం కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో కీలకమైన ఈ మ్యాచ్ లో ఎన్నో ఆశలు పెట్టుకున్న బాబర్ మరోసారి విఫమలయ్యాడు. ఈ సిరీస్ లో తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో 22 పరుగులు మాత్రమే చేశాడు.
ALSO READ : Gautam Gambhir all-time India XI: రోహిత్, బుమ్రాలకు నో ఛాన్స్.. గంభీర్ ఆల్‌టైం భారత జట్టు ఇదే
రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 31 పరుగులు చేసిన బాబర్.. తాజాగా రెండో ఇన్నింగ్స్ లో 11 పరుగులకే పరిమితమయ్యాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-2025 లో బాబర్ ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేయలేకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బాబర్ తో పాటు పాక్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఈ టెస్టులో పాకిస్థాన్ నాలుగో రోజు లంచ్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ప్రస్తుతం పాకిస్థాన్ 129 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజ్ లో మహ్మద్ రిజ్వాన్ (38), అఘా సల్మాన్ (7) ఉన్నారు.
THE STREAK OF BABAR AZAM...!!!
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 2, 2024
- 616 days since Babar Azam last scored a Test fifty. 🤯 pic.twitter.com/Hg1tYU6gRP