టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో దాదాపు సగం బ్యాటింగ్ రికార్డులు విరాట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ రికార్డ్స్ ఒకొక్కటిగా బ్రేక్ చేస్తూ ఆల్ టైం బెస్ట్ బ్యాటర్ గా ముందకెళ్తున్నాడు. అయితే సమీప భవిష్యత్తులో కోహ్లీ రికార్డ్స్ బ్రేక్ చేయడం బాబర్ అజామ్ కే సాధ్యమని ఇప్పటికీ చాలామంది పాకిస్థాన్ ఫ్యాన్స్ కొంతమంది ఎక్స్ పర్ట్స్ భావించారు. కానీ బాబర్ మాత్రం తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.
టీ20, వన్డేల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఈ పాక్ బ్యాటర్.. టెస్టుల్లో దారుణమైన బ్యాటింగ్ తో జట్టుకు భారంగా మారుతున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పై జరుగుతున్న తొలి టెస్ట్.. తొలి ఇన్నింగ్స్ లో డకౌటయ్యాడు. 16 పరుగులకే 2 వికెట్లు పడిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన బాబర్ ఎదుర్కొన్న రెండో బంతికే షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టెస్టుల్లో చివరి 10 ఇన్నింగ్స్ లు చూసుకుంటే బాబర్ ఆజాంకు ఒక్క హాఫ్ సెంచరీ లేదు. కెప్టెన్సీ నుంచి తప్పించినా బ్యాటింగ్ లో మాత్రం మార్పు రావడం లేదు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేస్తున్న పాకిస్థాన్ తొలి రోజు ఆట ముగిసే సమాయానికి 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. సైమ్ అయూబ్, సౌద్ షకీల్ హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. మహ్మద్ రిజ్వాన్ (24), సౌద్ షకీల్ (57) క్రీజ్ లో ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమ్మద్, షోరిఫుల్ ఇస్లాం తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
Babar Azam falls for a two-ball duck in the first innings of the first Test against Bangladesh. 🏏 pic.twitter.com/WMzeecN77s
— CricketGully (@thecricketgully) August 21, 2024