పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కి చేదు అనుభవం ఎదురైంది. వరల్డ్ కప్ కి రేపు భారత్ కి పయనమవుతుండగా నేడు ఊహించని పరిణామం ఎదురైంది. తాజా సమాచారం ప్రకారం.. కరాచీ గుండా కార్ లో ప్రయాణిస్తున్న బాబర్ ఓవర్ స్పీడ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన పంజాబ్ మోటర్‌వేలో రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగింది. ప్రస్తుతం ఈ వార్త క్రికెట్ కమ్యూనిటీని,దేశ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
బాబర్ 150 kmph కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించినట్లు నివేదించబడింది. ఇంత స్పీడ్ గా వెహికల్ నడపడం చట్ట రీత్యా నేరం. దీంతో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు బాబర్ ని అదుపులోకి తీసుకున్న పంజాబ్ పోలీసులు అతనికి భారీగా జరిమానా విధించినట్లుగా తెలుస్తుంది. అయితే బాబర్ ఇలా ట్రాఫిక్ లో చిక్కడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఓవర్ స్పీడ్ తో పోలీసులకు చిక్కాడు. పాకిస్థాన్ జాతీయ జట్టుకు కెప్టెన్ అయ్యుండి ఇలా ఓవర్ స్పీడ్ లో వెళ్లడం ఇప్పుడు ఫ్యాన్స్ ని ఆందోళనకి గురి చేస్తుంది. మరో వైపు భారత అభిమానులు బాబర్ అజామ్ పై ట్రోల్స్ చేయడం ప్రారంభించేసారు.
కాగా.. వరల్డ్ కప్ కోసం వీసా పనులని ముగించుకొని పాకిస్థాన్ రేపు భారత్ కి పయనమవుతుంది. ఈ నెల 29 న న్యూజీలాండ్ తో, వచ్చే నెల 3 న ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఇక వరల్డ్ కప్ లో తమ తొలి మ్యాచ్ అక్టోబర్ 6 న నెదర్లాండ్స్ తో తలపడాల్సి ఉంది.