శ్రీలంక పర్యటనను పాకిస్తాన్ జట్టు విజయవంతంగా ముగించింది. ఆతిథ్య జట్టును వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. తొలి టెస్టులో కనీస పోటీ ఇచ్చిన లంకేయులు.. రెండో టెస్టులో ఆమాత్రం ప్రదర్శన కూడా చేయలేకపోయారు.
తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే ఆలౌటైన లంక.. రెండో ఇన్నింగ్స్‌లో 188 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్స్ 222 పరుగులు తేడాతో లంక ఓటమిపాలైంది. కాగా, అంతకుముందు అబ్దుల్లా షఫీక్ (201), ఆగా సల్మాన్ (132) దంచికొట్టడంతో పాకిస్థాన్ 576/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
అభిమాని కోరిక తీర్చిన బాబర్ ఆజాం
పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం గొప్పమనసు చాటుకున్నారు. మ్యాచ్ ముగిశాక అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇచ్చే ప్రయత్నం చేసిన పాక్ కెప్టెన్.. ఓ అభిమాని అడగ్గానే జెర్సీ ఇచ్చేశారు. అనంతరం తన శరీరాన్ని చేతులతో కప్పుకొని బాబర్ ఆజాం.. డ్రెస్సింగ్ రూం వైపు పరుగులు పెట్టారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
Babar Azam Gifted his Test Jersey to a Young Fan So Cute???. #BabarAzam #NoChangeNeededPCB pic.twitter.com/KBMtBAYFcE
— Shaharyar Ejaz ? (@SharyOfficial) July 27, 2023
ఒంటిపై ఏం లేదని తెలిసినా.. అభిమాని కోరిక తీర్చినందుకు బాబర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అభిమాని మనసు నొప్పించకుండా అతని చేసిన పనిని అందరూ సమర్థిస్తున్నారు. మరో అభిమానికి.. పాక్ బౌలర్ నుమాన్ అలీ తన జెర్సీని బహుమతిగా ఇచ్చారు.