![PAK vs NZ: వన్డేల్లో బాబర్ వండర్.. కోహ్లీని వెనక్కి నెట్టి ప్రపంచ రికార్డ్](https://static.v6velugu.com/uploads/2025/02/babar-azam-has-become-the-joint-fastest-batter-to-surpass-the-6000-odi-runs-mark_qjPxiYQv5A.jpg)
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో దాదాపు సగం రికార్డులు విరాట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ రికార్డ్స్ ఒకొక్కటిగా బ్రేక్ చేస్తూ ఆల్ టైం బెస్ట్ బ్యాటర్ గా ముందకెళ్తున్నాడు. అయితే సమీప భవిష్యత్తులో కోహ్లీ రికార్డ్స్ బ్రేక్ చేయడం బాబర్ అజామ్ కే సాధ్యమని ఇప్పటికీ చాలామంది క్రికెట్ ఫ్యాన్స్, ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా కోహ్లీని వెనక్కి నెట్టి వన్డేల్లో బాబర్ ఆల్ టైం రికార్డ్ ను ఒకటి నెలకొల్పాడు.
ట్రై-సిరీస్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్ అజామ్ 34 బంతుల్లో 29 పరుగులు పరుగులు చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా మాజీ సౌతాఫ్రికా బ్యాటర్ హషీమ్ ఆమ్లా రికార్డ్ ను సమం చేశాడు. రెండో స్థానంలో కొనసాగుతున్న కోహ్లీని బాబర్ వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించడం విశేషం. విరాట్ కోహ్లీకి వన్డేల్లో 6,000 పరుగులు చేయడానికి 136 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. బాబర్, ఆమ్లాకు 123 ఇన్నింగ్స్ లే అవసరమయ్యాయి. విలియంసన్, వార్నర్ 139 ఇన్నింగ్స్ ల్లో 6000 పరుగులు పూర్తి చేసుకొని నాలుగో స్థానంలో నిలిచారు.
ALSO READ | Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కాదు.. గాయాల ట్రోఫీ: మెగా టోర్నీ నుంచి మరొకరు ఔట్
బాబర్ ఇటీవలే పెద్దగా ఫామ్ లో లేకపోయినా అతను వరల్డ్ రికార్డ్ సమం చేయడం విశేషం. ప్రస్తుతం జరుగుతున్న ట్రై సిరీస్ లో తొలి మూడు వన్డేల్లో వరుసగా 10,23,29 పరుగులు చేసి విఫలమయ్యాడు. చివరిసారిగా బాబర్ 2023 లో నేపాల్ పై వన్డేల్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఆసియా కప్, వరల్డ్ కప్ లో విఫలమయ్యాడు. దీంతో క్రమంగా బాబర్ ఫామ్ దిగజారుతూ వస్తుంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ 30 ఓవర్లలో 120 పరుగులు చేసింది. క్రీజ్ లో మొహమ్మద్ రిజ్వాన్(33), సల్మాన్ అఘా (31) ఉన్నారు.