టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో దాదాపు సగం రికార్డులు విరాట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ రికార్డ్స్ ఒకొక్కటిగా బ్రేక్ చేస్తూ ఆల్ టైం బెస్ట్ బ్యాటర్ గా ముందకెళ్తున్నాడు. అయితే సమీప భవిష్యత్తులో కోహ్లీ రికార్డ్స్ బ్రేక్ చేయడం బాబర్ అజామ్ కే సాధ్యమని ఇప్పటికీ చాలామంది క్రికెట్ ఫ్యాన్స్, ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా కోహ్లీ నెలకొల్పిన ఒక ఆల్ టైం రికార్డ్ ను బ్రేక్ చేసేందుకు బాబర్ సిద్ధమయ్యాడు.
ప్రస్తుతం టీ20ల్లో 4037 పరుగులతో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 3974 పరుగులతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉండగా.. 3698 పరుగులతో బాబర్ అజామ్ మూడో స్థానంలో నిలిచాడు. టీ20ల్లో కోహ్లీ, బాబర్ అజామ్ మధ్య కేవలం 339 పరుగుల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఈ రికార్డ్ ను అధిగమించడానికి బాబర్ అజామ్ కు గోల్డెన్ ఛాన్స్ లభించింది. టీ20 వరల్డ్ కప్ లోపు పాకిస్థాన్ మొత్తం 12 టీ20 మ్యాచ్ లు ఆడనుంది.
ఏప్రిల్ 18 నుంచి న్యూజిలాండ్ తో స్వదేశంలో 5 టీ20 మ్యాచ్ లు.. మే నెలలో ఐర్లాండ్ తో 3 టీ20 మ్యాచ్ లు.. ఇంగ్లాండ్ తో 4 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. దీంతో బాబర్ మ్యాచ్ కు సరాసరి 30 పరుగులు చేసినా కోహ్లీ అత్యధిక పరుగుల రికార్డ్ బ్రేక్ చేయొచ్చు. టీ20 వరల్డ్ కప్ లోపు బాబర్ ఈ రికార్డ్ బద్దలు కొడతాడో లేదో చూడాలి. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ శర్మ ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ లోపు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు లేకపోవడంతో బాబర్ వీరి రికార్డ్ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
Babar Azam will lead Pakistan in the upcoming five-match T20I series against New Zealand
— Cricket Pakistan (@cricketpakcompk) April 15, 2024
Read More: https://t.co/VOlopsQjAA#PAKvNZ #BabarAzam #ViratKohli pic.twitter.com/I8kn6efLGX