హైదరాబాద్ లో పాక్ ఆటగాళ్లు ఏ ముహూర్తాన అడుగు పెట్టారో కానీ అప్పటినుంచి ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు. ఇక్కడ మర్యాదల నుంచి ఆహారం వరకు అంతా బాగుందని ఇప్పటికే పాక్ ఆటగాళ్లు కొనియాడిన సంగతి తెలిసిందే. తాజాగా కెప్టెన్ బాబర్ అజామ్ కోసం స్పెషల్ జెట్ ని ఏర్పాటు చేసారు.ఇంతకీ పాక్ కెప్టెన్ కి ఇలా స్పెషల్ జెట్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.
వరల్డ్ కప్ ముందు కెప్టెన్సీ సమావేశం అహ్మదాబాద్ లో జరిగింది. ఈ మీటింగ్ కి హాజరయ్యే క్రమంలో బాబర్ అజామ్ కోసం బీసీసీఐ ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇలా పాక్ కెప్టెన్ కి ప్రత్యేకంగా జెట్ వేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక అహ్మదాబాద్ లో దిగిన తర్వాత బాబర్.. భారత కెప్టెన్ రోహిత్ శర్మను కలుసుకున్నాడు. ఇక్కడ జరిగిన సమావేశంలో అందరు కెప్టెన్లు తమ అభిప్రాయలు చెప్పగా.. రోహిత్, బాబర్ సరదాగా మాట్లాడుతూ అందరినీ నవ్వించారు.
ఈ మీటింగ్ అనంతరం పాక్ కెప్టెన్ మళ్ళీ హైదరాబాద్ రావాల్సి ఉంది. వరల్డ్ కప్ షెడ్యూల్ లో భాగంగా పాకిస్థాన్ తమ తొలి రెండు మ్యాచులని హైదరాబాద్ లోనే ఆడాల్సి ఉంది. అక్టోబర్ 6 న నెదర్లాండ్స్ తో, అక్టోబర్ 10 న శ్రీలంకతో మ్యాచులు జరుగుతాయి. ఈ రెండు మ్యాచుల తర్వాత పాకిస్థాన్ భారత్ తో మ్యాచ్ కోసం అహ్మదాబాద్ రావాల్సి ఉంది. అక్టోబర్ 14 న ఈ మ్యాచ్ జరగనుంది.