Cricket World Cup 2023: ఇంగ్లాండ్‌ను 287 పరుగులతో చిత్తు చేస్తాం.. మా దగ్గర స్పెషల్ ప్లాన్ ఉంది: బాబర్ అజామ్

Cricket World Cup 2023: ఇంగ్లాండ్‌ను 287 పరుగులతో చిత్తు చేస్తాం.. మా దగ్గర స్పెషల్ ప్లాన్ ఉంది: బాబర్ అజామ్

వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ప్రస్తానం దాదాపుగా ముగిసిపోయింది. లెక్కల ప్రకారం సెమీస్ కు వెళ్లే అవకాశం ఉన్నా.. దాదాపుగా అది సాధ్యం కాదనే చెప్పాలి. ప్రస్తుతం పాక్ ఖాతాలో 8 పాయింట్లు ఉన్నాయి. నేడు( నవంబర్ 11) ఇంగ్లాండ్ మీద జరిగే మ్యాచ్ గెలిస్తే 10 పాయింట్లు అవుతాయి. అయితే నెట్ రన్ తక్కువగా ఉండడమే పాక్ కొంప ముంచింది. ఈడెన్ గార్డెన్ లో ఇంగ్లాండ్ పై నేడు జరగనున్న మ్యాచ్ లో పాక్ 287 పరుగుల భారీ తేడాతో గెలిస్తేనే న్యూజిలాండ్ ను వెనక్కి నెట్టి సెమీస్ కు వెళ్తుంది. ఒకవేళ ఛేజింగ్ చేయాల్సి వస్తే 284 బంతులు మిగిలించి అనగా.. 15 బంతుల్లోనే టార్గెట్ కొట్టేయాలి. 

ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. పాక్ మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, మిస్బావుల్ హక్ సెమీస్ కు పాక్ ఎలా వెళ్లాలో చెబుతూ సొంత జట్టుపై సెటైర్లు వేస్తున్నారు. కానీ పాక్ కెప్టెన్ బాబర్ అజాం మాత్రం తమ జట్టు సెమీస్ కు వెళ్లగలదని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తన దగ్గర ఉన్న స్పెషల్ ప్లాన్ చెప్పి సెమీస్ కు వెళ్తామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
 
బాబర్ అజామ్ మాలాడుతూ " ఫకర్ జమాన్ మా జట్టులో మ్యాచ్ విన్నర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు మా జట్టులో 20 నుంచి 30 ఓవర్లు ఉండగలిగితే మేము భారీ స్కోర్ చేయడం ఖాయం. ఈ రకంగా చేయగలిగితే ఇంగ్లాండ్ పై 287 పరుగుల తేడాతో ఓడించి మేము సెమీస్ కు చేరతాం" అని బాబర్ తెలిపాడు. ఈ టోర్నీలో పాక్ తమ చివరి రెండు మ్యాచ్ లు బంగ్లా, కివీస్ లపై   గెలిచిందంటే ఓపెనర్ ఫకర్ జమాన్ అసాధారణ బ్యాటింగ్ అనే చెప్పాలి. 

Also Read :- ఆఖరి ఫైట్‌‌కు.. ఇంగ్లండ్, పాకిస్తాన్‌‌ రెడీ

ముఖ్యంగా న్యూజిలాండ్ పై జరిగిన మ్యాచ్ లో 81 బతుల్లోనే 126 పరుగులు చేసి ఒంటి చేత్తో పాక్ ను విజయ తీరాలకు చేర్చాడు. మరి బాబర్ నమ్మకాన్ని ఈ స్టార్ ఓపెనర్ ఎంతవరకు నిలబడతాడో చూడాలి. మరోవైపు టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇంగ్లాండ్ కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.  2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాలంటే బట్లర్ సేన ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా విజయం సాధించాలి. ఈ నేపథ్యంలో పాక్ ఏ విధంగా పోరాడుతుందో ఆసక్తికరంగా మారింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)