టీ20 వరల్డ్ కప్ 2024 కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు అమెరికాలో అడుగుపెట్టింది. శనివారం (జూన్ 1) యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)లో అడుగుపెట్టిన తర్వాత భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ను పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం కలిశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఈ వీడియోను తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా వీడియో షేర్ చేసింది.
వీరి మధ్య జరిగిన సంభాషణలో బాబర్‌కు గవాస్కర ఈ టోర్నీకి సంబంధించి కొన్ని కీలకమైన సలహాలను ఇచ్చాడు. 2023లో భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లోనూ గవాస్కర్ బాబర్ ఆజాం ను కలిసి తాను సంతకం చేసిన టోపీని బహుమతిగా ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్ 2024 లో బాబర్ అజామ్ లోని పాకిస్థాన్ జట్టు ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న పాక్.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది.
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 2009 లో మాత్రమే పాకిస్థాన్ చివరిసారిగా వరల్డ్ కప్ గెలిచింది. 2022లో చివరిసారిగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో పాకిస్థాన్ రన్నరప్ గా నిలిచింది. ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. ఆదివారం (జూన్ 2) నుంచి జరగనున్న వరల్డ్ కప్ లో పాక్ తమ తొలి మ్యాచ్ ను అమెరికాతో ఆడుతుంది. జూన్ 6 న ఈ మ్యాచ్ జరుగుతుంది. బాబర్ అజామ్ పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్నాడు.