పాకిస్థాన్ కెప్టెన్.. టీ20ల్లో వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్ బాబర్ అజామ్ ఆల్ టైం రికార్డ్ ఒకటి తన ఖాతాలో వేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలుగా టీ20 క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న బాబర్.. ఈ ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా సరి కొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ నిన్నటివరకు ఈ లిస్ట్ లో టాప్ లో ఉండగా తాజాగా బాబర్ ఈ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. దీంతో కోహ్లీ తన టీ20 కెరీర్ లో 4038 పరుగులతో రెండో స్థానానికి పడిపోగా.. బాబర్ 4067 పరుగులతో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
నిన్న (జూన్ 6) అమెరికాతో జరిగిన మ్యాచ్ లో 16 పరుగులు కొట్టిన తర్వాత బాబర్ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో పాక్ కెప్టెన్ 40 పరుగులు చేసి ఔటయ్యాడు. 4026 పరుగులతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ లిస్టులో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. బాబర్, కోహ్లీ, రోహిత్ మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో టీ20 వరల్డ్ కప్ ముగిసేలోపు ఈ రికార్డ్ ఎవరి పేరిట నిలుస్తుందో ఆసక్తికరంగా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజామ్ 43 బంతుల్లో 44 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 160 పరుగుల లక్ష్య ఛేదనలో యూఎస్‌ఏ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సరిగ్గా 159 రన్స్ చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌లో అమెరికా 18 పరుగులు చేసింది. పాక్ సూపర్ ఓవర్‌లో 13 పరుగులకే పరిమితమై 5 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది.
T20I క్రికెట్‌లో అత్యధిక పరుగులు
1) బాబర్ ఆజం (పాకిస్థాన్) - 113 ఇన్నింగ్స్‌ల్లో 4,067 పరుగులు
2) విరాట్ కోహ్లీ (భారత్) - 110 ఇన్నింగ్స్‌ల్లో 4,038 పరుగులు
3) రోహిత్ శర్మ (భారత్) - 143 ఇన్నింగ్స్‌ల్లో 4,026 పరుగులు
4) పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్) - 142 ఇన్నింగ్స్‌లలో 3,591 పరుగులు
5) కోలిన్ మున్రో (న్యూజిలాండ్) - 118 ఇన్నింగ్స్‌లలో 3,531 పరుగులు