T20 World Cup 2024: కోహ్లీ కోసం ప్లాన్ సిద్ధంగా ఉంది.. వరల్డ్ కప్ మ్యాచ్‌పై బాబర్

T20 World Cup 2024: కోహ్లీ కోసం ప్లాన్ సిద్ధంగా ఉంది.. వరల్డ్ కప్ మ్యాచ్‌పై బాబర్

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ప్రత్యేకమే. ఐసీసీ టోర్నీలో ఈ రెండు జట్లు ఆడితే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండటం గ్యారంటీ. దీనికి తగ్గట్టుగానే ఐసీసీ 2013 నుంచి ఇండియా, పాకిస్థాన్ జట్లను ఒకే గ్రూప్ లో ఉండేలా షెడ్యూల్ ఏర్పాటు చేస్తుంది. ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 2024 టీ20 వరల్డ్ కప్ కు దాయాధి జట్లను ఒకే గ్రూప్ లో ఆడనున్నారు. న్యూయార్క్ వేదికగా జూన్ 9న ఈ మ్యాచ్ జరగనుంది. 

భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటే అందరికీ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీనే గుర్తుకొస్తాడు. పాకిస్థాన్ అంటే కోహ్లీ పూనకం వచ్చినట్టుగా ఆడుతాడు. దాయాధి దేశంపై కోహ్లీ 10 టీ20ల్లో 81.33 సగటుతో 488 పరుగులు చేశాడు. 35 ఏళ్ల ఈ స్టార్ బ్యాటర్ చివరిసారిగా 2022 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడి భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో కోహ్లీపై ఈ సారి భారీ అంచనాలే ఉన్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో కోహ్లీని ఔట్ చేయడానికి తమ దగ్గర ప్లాన్ ఉందని బాబర్ అన్నాడు. 

"ఒక జట్టుగా మేము ఒకే ఆటగాడికి వ్యతిరేకంగా ఏమీ ప్లాన్ చేయము. మొత్తం పదకొండు మంది ఆటగాళ్ల కోసం మా వ్యూహాలు అమలు చేస్తాం. న్యూయార్క్‌లోని పరిస్థితుల గురించి మాకు పెద్దగా తెలియదు. విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని మాకు తెలుసు. అతడిపై కూడా మేము ప్లాన్ సిద్ధం చేశాం. అని లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం నుంచి బాబర్ బయలుదేరే ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. వరల్డ్ కప్ లోపు పాకిస్థాన్.. ఐర్లాండ్ తో మూడు, ఇంగ్లాండ్ తో 4 టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.